Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లికి సిద్ధమైన మరో క్రికెటర్.. ఈ నెలలోనే ఓ ఇంటివాడు కాబోతున్న కృనాల్ పాండ్యా!

  • ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయబోతున్న కృనాల్
  • గత కొన్నాళ్లుగా సహజీవనం.. ఈనెల 27న వివాహం 
  • ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్‌కు అనూహ్య స్పందన
టీమిండియాలో ఇది పెళ్లిళ్ల కాలంలా కనిపిస్తోంది. జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, తాజాగా విరాట్ కోహ్లీలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా నడుస్తున్నాడు. ఈ నెల 27న ప్రేయసి పంఖురీ శర్మ మెడలో మూడు ముళ్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు.

పెళ్లికి ముందే కాబోయే భార్యాభర్తలిద్దరూ ప్రీ-వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కృనాల్ పెట్టిన ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. పంఖురీ శర్మను కృనాల్ రెండేళ్ల క్రితం ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిశాడు. స్నేహం చిగురించి ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఫంఖురీ చేతిలో తన సోదరుడు డకౌట్ అయ్యాడని హార్ధిక్ పాండ్యా ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.  
Krunal Pandya
Hardik Pandya
pankhuri sharma

More Telugu News